అన్నీ గవర్నర్‌ చేతుల్లో ఉండవు

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంపై ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో స్పీకర్‌ బిమన్‌ బెనర్జీ శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 05 Jul 2024 04:21 IST

బెంగాల్‌ అసెంబ్లీ ప్రత్యేక భేటీ ఏర్పాటుచేస్తూ స్పీకర్‌ వ్యాఖ్య

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంపై ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో స్పీకర్‌ బిమన్‌ బెనర్జీ శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శాసనసభ నిర్వహణ అనేది పూర్తిగా గవర్నర్‌పైనే ఆధారపడి ఉండదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. మీడియాతో బిమన్‌ బెనర్జీ మాట్లాడుతూ.. శుక్రవారం బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశం ముగియగానే, మధ్యాహ్నం 2.00 గంటల నుంచి ప్రత్యేక సమావేశాలు మొదలవుతాయని చెప్పారు. ‘‘శాసనసభ నిస్సహాయురాలని ఎవరైనా అనుకుంటే అది వాళ్ల తప్పు. అయినా అన్నీ గవర్నర్‌ చేతుల్లోనూ ఉండవు. మీరు మా చేత బలవంతంగా ఏదీ చేయించలేరు. ప్రతిదానికీ కొన్ని నియమాలు, రాజ్యాంగబద్ధమైన నిబంధనలు ఉన్నాయి. అందరం వాటికి బద్ధులమే’’ అన్నారు. మరోవైపు.. గవర్నర్‌తో ఏకాభిప్రాయం కుదరక ప్రమాణస్వీకారం ఆగిపోయిన ఇద్దరు కొత్త ఎమ్మెల్యేలు శాసనసభ ఆవరణలో గురువారం ఆరో రోజు తమ నిరసన ప్రదర్శనను కొనసాగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని