మళ్లీ సీఎంగా హేమంత్‌

ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత హేమంత్‌ సోరెన్‌ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టారు. గురువారం సాయంత్రం ఆయన సీఎంగా ప్రమాణం చేశారు.

Published : 05 Jul 2024 04:18 IST

రాంచీ: ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత హేమంత్‌ సోరెన్‌ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టారు. గురువారం సాయంత్రం ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. భూకుంభకోణం కేసులో అరెస్టయి ఇటీవలే బెయిలుపై విడుదలైన హేమంత్‌.. 5 నెలల తర్వాత మళ్లీ ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ప్రమాణ కార్యక్రమానికి హేమంత్‌ సోరెన్‌ తండ్రి శిబు సోరెన్, తల్లి రూపి సోరెన్, భార్య కల్పనా సోరెన్, మాజీ ముఖ్యమంత్రి చంపయీ సోరెన్‌ తదితరులు హాజరయ్యారు. 2013లో తొలిసారిగా అతి పిన్న వయసులో ఝార్ఖండ్‌కు హేమంత్‌ ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో రెండోసారి బాధ్యతలు చేపట్టారు. గురువారం మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కొత్త క్యాబినెట్‌లో సీఎం సతీమణి కల్పనా సోరెన్‌కు చోటు దక్కే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఝార్ఖండ్‌ అసెంబ్లీలో జేఎంఎం కూటమికి 45 మంది ఎమ్మెల్యేలున్నారు. 81 సీట్లున్న అసెంబ్లీలో ప్రస్తుతం 76 మంది సభ్యులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని