పదెకరాల వరకు ‘రైతు భరోసా’ అమలు చేయండి

రైతు భరోసా పథకం అమలు కోసం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై సూచనలు, సలహాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు.

Published : 05 Jul 2024 04:14 IST

సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు వినతి 

నల్లకుంట, న్యూస్‌టుడే: రైతు భరోసా పథకం అమలు కోసం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై సూచనలు, సలహాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు. ఈ మేరకు తమ పార్టీ తరఫున లేఖను గురువారం సచివాలయంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి అందజేశామని తెలిపారు. అనంతరం హైదరాబాద్‌ విద్యానగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పదెకరాల వరకు ఉన్న రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయంగా ఇవ్వాలని కోరామన్నారు. వ్యవసాయేతర భూములు, గుట్టలు, స్థిరాస్తి సంస్థల స్థలాలు, ఎన్‌ఆర్‌ఐలకు ఈ పథకాన్ని వర్తింపజేయవద్దని సూచించామన్నారు. వరికి ఇస్తామన్న రూ.500 బోనస్‌ను అన్ని రకాల వరి వంగడాలకు అమలు చేయాలని చెప్పామన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు కల్పించడం సహా స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరామన్నారు. ఎన్నికల హామీ మేరకు కౌలుదారులకు పెట్టుబడి సాయాన్ని అందించాలని లేఖలో ప్రస్తావించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు