భాజపా ఓ పరాన్నజీవి

భాజపా ఓ పరాన్నజీవి లాంటిదని, ప్రాంతీయ పార్టీలను మింగేసిందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఆరోపించారు. పార్లమెంటు బయట ఏకాభిప్రాయం గురించి ప్రధాని మోదీ మాట్లాడతారని, లోపల ఘర్షణ పడతారని విమర్శించారు.

Published : 05 Jul 2024 04:08 IST

ప్రాంతీయ పార్టీలను మింగేసింది
జైరాం రమేశ్‌ విమర్శ

దిల్లీ: భాజపా ఓ పరాన్నజీవి లాంటిదని, ప్రాంతీయ పార్టీలను మింగేసిందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఆరోపించారు. పార్లమెంటు బయట ఏకాభిప్రాయం గురించి ప్రధాని మోదీ మాట్లాడతారని, లోపల ఘర్షణ పడతారని విమర్శించారు. 18వ లోక్‌సభ తొలి సమావేశాల ద్వారా ఇండియా కూటమి రూపంలో సరికొత్తదైన, దూకుడుగా వ్యవహరించే, పునరుత్థానం పొందిన ప్రతిపక్ష కూటమి ఆవిర్భవించిందని గురువారం ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. 2024 ఎన్నికల ఫలితాలు.. నిర్ణయాత్మకమని, మోదీకి వ్యక్తిగతంగా, రాజకీయంగా, నైతికంగా ఓటమిని చవిచూపించాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని