Congress: టీపీసీసీ అధ్యక్షుడి నియామకం తాత్కాలికంగా వాయిదా

తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకం తాత్కాలికంగా వాయిదా పడింది. 

Published : 03 Jul 2024 19:09 IST

దిల్లీ: తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకం తాత్కాలికంగా వాయిదా పడింది. కాంగ్రెస్‌ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోడంతో ఎంపిక ప్రక్రియను ఏఐసీసీ వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఈ విషయమై వారం రోజుల్లో మరోసారి చర్చించాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. కాంగ్రెస్‌ అగ్రనేతల పరస్పర అంగీకారం అనంతరం పీసీసీ అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

పీసీసీ పదవి కోసం ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌గౌడ్, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్, ఎంపీలు బలరాంనాయక్, సురేశ్‌ షెట్కర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్కలు సైతం అధ్యక్ష పదవిని అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడి నియామకం తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని