పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ: తెదేపా నేత కేఎస్‌ జవహర్‌

ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేసి సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెదేపా సీనియర్‌ నేత కేఎస్‌ జవహర్‌ కొనియాడారు.

Published : 03 Jul 2024 04:48 IST

ఈనాడు డిజిటల్, అమరావతి: ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేసి సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెదేపా సీనియర్‌ నేత కేఎస్‌ జవహర్‌ కొనియాడారు. రాష్ట్రమంతా పండగ వాతావరణం మధ్య సామాజిక పింఛన్లు పంపిణీ చేశారన్నారు. రాష్ట్రంలో ఇకపై సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల్లా సాగిపోతాయని ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. ‘ఎన్నికల ముందు వాలంటీర్లు లేరనే వంకతో ఇంటింటికీ పింఛను ఇవ్వకుండా సుమారు 60 మంది వృద్ధుల ప్రాణాలు పోవడానికి జగన్‌ కారకులయ్యారు. వాలంటీర్లు లేకుంటే ఇంటింటికీ పింఛన్లు ఇవ్వలేనని చెప్పిన అసమర్థుడు జగన్‌’ అని కేఎస్‌ జవహర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని