పరువు నష్టం కేసులో టీఎంసీ ఎంపీకి రూ.50 లక్షల జరిమానా

పరువు నష్టం కేసులో తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) రాజ్యసభ ఎంపీ సాకేత్‌ గోఖలేకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో మాజీ దౌత్యవేత్తకు రూ.50లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది.

Published : 02 Jul 2024 06:05 IST

దిల్లీ: పరువు నష్టం కేసులో తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) రాజ్యసభ ఎంపీ సాకేత్‌ గోఖలేకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో మాజీ దౌత్యవేత్తకు రూ.50లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. గతంలో దౌత్యవేత్తగా విధులు నిర్వహించిన లక్ష్మిపురీ ఆదాయానికి మించిన ఆస్తులు కొనుగోలు చేశారని 2021 జూన్‌లో సాకేత్‌ గోఖలే సోషల్‌ మీడియాలో పలుమార్లు ట్వీట్లు పెట్టారు. అంతేకాదు.. ఆమె భర్త అయిన కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీపై సైతం ఆరోపణలు చేశారు. దీంతో లక్ష్మిపురీ టీఎంసీ ఎంపీపై పరువు నష్టం కేసు వేశారు. తన ఆదాయం గురించి సాకేత్‌ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు. దీనిపై విచారణ అనంతరం తాజాగా తీర్పు వెలువరించిన దిల్లీ హైకోర్టు మాజీ దౌత్యవేత్తకు రూ.50లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని సాకేత్‌ గోఖలేను ఆదేశించింది. బహిరంగ క్షమాపణ చెప్పాలని పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని