అరకు కాఫీ రైతుల నష్టాన్ని విస్మరించిన మోదీ మన్‌కీబాత్‌

ఆదివాసీ రైతుల కృషితో ఆర్గానిక్‌ కాఫీ సాగు వల్ల అంతర్జాతీయ స్థాయిలో అరకు కాఫీకి గుర్తింపు లభించిందని, దీనిని ప్రధాని మోదీ తన మన్‌కీబాత్‌లో గుర్తించకపోవడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు.

Updated : 02 Jul 2024 06:54 IST

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శ

ఈనాడు, అమరావతి: ఆదివాసీ రైతుల కృషితో ఆర్గానిక్‌ కాఫీ సాగు వల్ల అంతర్జాతీయ స్థాయిలో అరకు కాఫీకి గుర్తింపు లభించిందని, దీనిని ప్రధాని మోదీ తన మన్‌కీబాత్‌లో గుర్తించకపోవడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. ‘‘రైతుల నష్టాన్ని విస్మరించి కాఫీ సొగసు గురించి మాట్లాడడం మోసం చేయడమే. అద్భుతమైన కాఫీని పండిస్తున్న 1.5 లక్షల కర్షకుల శ్రమ, గిట్టుబాటు ధర గురించి ప్రస్తావించకపోవడం అన్యాయం. ఆదివాసీ కాఫీ రైతులకు గిట్టుబాటు ధరలేక దళారుల చేతుల్లో మోసపోతున్నారు. వాతావరణం అనుకూలించనప్పుడు పంట సరిగా రాక నష్టపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం కాఫీ పంటకు కనీసం బీమా సౌకర్యం కూడా కల్పించడం లేదు. వారికి ఇస్తున్న ప్రోత్సహాకాలు తగ్గించేసింది. కాఫీ బోర్డును నిర్వీర్యం చేసింది. చాలా మంది గిరిజనులు ఉపాధి కోల్పోతున్నారు. ప్రధాని మోదీకి అరకు కాఫీపై ప్రేమ ఉంటే నిధులు కేటాయించి రైతులను ఆదుకోవాలి’’ అని సోమవారం ఓ ప్రకటనలో శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని