మేడిగడ్డపై విష ప్రచారమని తేలింది

మేడిగడ్డపై ఇంతకాలం కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసింది విష ప్రచారమని ఇప్పుడు తేలిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు.

Published : 02 Jul 2024 04:18 IST

‘ఎక్స్‌’లో కేటీఆర్‌ విమర్శలు 

ఈనాడు, హైదరాబాద్‌: మేడిగడ్డపై ఇంతకాలం కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసింది విష ప్రచారమని ఇప్పుడు తేలిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. ‘ఎక్స్‌’ వేదికగా సోమవారం ఆయన స్పందించారు. ‘‘నిన్నటి దాకా మేడిగడ్డ మేడిపండులా మారింది, అసలు రిపేర్‌ చేయడం అసాధ్యం అన్నారు. మరమ్మతులు చేసినా.. ఇక పనికి రాదన్నారు. రూ.లక్ష కోట్లు బూడిదలో పోసిన పన్నీరు అన్నారు. వర్షాకాలంలో వరదకు కొట్టుకుపోతుందన్నారు. అన్నారం బ్యారేజీ కూడా కూలిపోతుందన్నారు. నేడు మాత్రం.. మేడిగడ్డ మరమ్మతులు పూర్తి అంటున్నారు. అంటే.. ఇంతకాలం కాంగ్రెస్‌ చేసింది విష ప్రచారమని స్పష్టమవుతోంది. 8 నెలల నుంచి చేసింది కాలయాపనే అని రుజువైపోయింది. రిపేర్ల మాటున జరిగింది చిల్లర రాజకీయమని వెల్లడైపోయింది. ఇకనైనా కేసీఆర్‌ జల సంకల్పాన్ని హేళన చేసిన వారు క్షమాపణలు చెప్పాలి. తెలంగాణకే తలమానికమైన ప్రాజెక్టును తప్పుబట్టిన వారు ముక్కు నేలకు రాయాలి’’ అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని