భాజపా తగిన మూల్యం చెల్లించుకుంది

నిండు సభలో ఒక మహిళా ఎంపీ నోరు నొక్కేసినందుకు.. ఈసారి ఎన్నికల్లో 63 సొంత ఎంపీ సీట్లు కోల్పోయి భాజపా తగిన మూల్యం చెల్లించుకుందని తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా మండిపడ్డారు.

Published : 02 Jul 2024 04:22 IST

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా

దిల్లీ: నిండు సభలో ఒక మహిళా ఎంపీ నోరు నొక్కేసినందుకు.. ఈసారి ఎన్నికల్లో 63 సొంత ఎంపీ సీట్లు కోల్పోయి భాజపా తగిన మూల్యం చెల్లించుకుందని తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా సోమవారం ఆమె మాట్లాడారు. డబ్బులు తీసుకొని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలతో ఆమె బహిష్కరణకు గురైన నేపథ్యంలో.. ‘గత సభలో నన్ను మాట్లాడనీయకుండా చేశారు కానీ, ఈసారి ప్రజలు మీ నోళ్లను కట్టేశారు. అప్పటి మాదిరి ప్రతిపక్షాల పట్ల అమానవీయంగా ప్రవర్తించే పరిస్థితి ఇప్పుడు లేదు’ అని అన్నారు. సెంగోల్‌ అనేది రాచరికానికి గుర్తు అనీ, ప్రజాస్వామ్య దేశంలో దాని అవసరం లేదని.. సభలోంచి తొలగించాలని ఆమె డిమాండ్‌చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని