దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని ఆపండి

ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోందని, వెంటనే దానిని ఆపాలని ఇండియా కూటమి ఎంపీలు డిమాండు చేశారు.

Published : 02 Jul 2024 04:24 IST

ఇండియా కూటమి ఎంపీల నిరసన

దిల్లీ: ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోందని, వెంటనే దానిని ఆపాలని ఇండియా కూటమి ఎంపీలు డిమాండు చేశారు. సోమవారం పలువురు ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపారు. ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీతోపాటు తృణమూల్, ఆమ్‌ ఆద్మీ పార్టీ, తదితర పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంటు మకర ద్వారంవద్ద ఆందోళన నిర్వహించారు. ప్రతిపక్షాల నోళ్లు మూయించేందుకు దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడాన్ని ఆపాలని, భాజపాలో చేరితే అవినీతి మాయమయ్యే చర్యలకు స్వస్తి పలకాలని ప్లకార్డులను ప్రదర్శించారు. జైలులో ఉన్న కేజ్రీవాల్‌ చిత్రాన్ని ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చడ్డా ప్రదర్శించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని