భారాస నేతల కొత్త డ్రామాలు: ఎక్స్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ విమర్శ

ఉద్యోగాల భర్తీకి అతి త్వరలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించబోతున్నట్లు ఎక్స్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ వెల్లడించింది.

Published : 02 Jul 2024 04:19 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగాల భర్తీకి అతి త్వరలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించబోతున్నట్లు ఎక్స్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ వెల్లడించింది. ఈ విషయం తెలిసే భారాస నేతలు కొత్త డ్రామాకు తెరలేపారని, కుతంత్రాల విషయంలో వారి వైఖరి మారలేదని ఆరోపించింది. ‘‘గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఇచ్చి రెండుసార్లు రద్దు చేసి.. ప్రశ్నపత్రాలు లీక్‌ చేసి టీజీపీఎస్సీ లాంటి ప్రతిష్ఠాత్మక వ్యవస్థను భ్రష్టుపట్టించిన విషయం మర్చిపోయారా? ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయమంటే, ఉన్నవి తొలగించి 4,500 పాఠశాలలను మూసేసిన విషయం మర్చిపోయారా? సునీల్‌నాయక్‌ బాషా లాంటి వారు ఉద్యోగాల కోసం నిరీక్షించి ఆత్మహత్యలు చేసుకున్న విషయం మర్చిపోయారా?’’ అని కాంగ్రెస్‌ పేర్కొంది. తాము 11,062 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చామని, 560 పైగా పోస్టుల భర్తీకి గ్రూప్‌-1 పరీక్ష నిర్వహించామని, పాఠశాలలకు మంజూరైన పోస్టులన్నీ భర్తీ చేస్తున్నామని తెలిపింది.

నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్న భారాస

భారాస నాయకులు పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడి..ఇప్పుడు వారిని రెచ్చగొడుతూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, నాయకులతో కలిసి ఆయన సోమవారం గాంధీభవన్‌లో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని