నా సభ్యత్వం రద్దు చేయాలని భాజపా ఎలా అడుగుతుంది?: దానం

తన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సభాపతిని భాజపా శాసనసభా పక్షనేత ఎ.మహేశ్వర్‌రెడ్డి ఏ హోదాలో అడుగుతున్నారని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ప్రశ్నించారు.

Published : 02 Jul 2024 04:27 IST

హైదరాబాద్, న్యూస్‌టుడే: తన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సభాపతిని భాజపా శాసనసభా పక్షనేత ఎ.మహేశ్వర్‌రెడ్డి ఏ హోదాలో అడుగుతున్నారని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ప్రశ్నించారు. అడిగితే భారాస అధ్యక్షుడు కేసీఆర్‌ అడగాలి కానీ.. భాజపాకు ఏం సంబంధమని అన్నారు. సోమవారం సచివాలయం మీడియా పాయింట్‌లో దానం మాట్లాడారు. ‘‘లోక్‌సభ ఎన్నికల్లో భారాస, భాజపా పరస్పరం సహకరించుకున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతుందని భాజపా, భారాస నేతలు అంటున్నారు. ఎలా పడిపోతుందో చెప్పాలి. పార్టీ ఫిరాయింపులపై భారాస నేతలు మాట్లాడటం హాస్యాస్పదం’’ అని దానం పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని