పార్టీ ఫిరాయింపులపై సీఎం తీరు సరికాదు

రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయమని భాజపా శాసనసభా పక్షనేత ఎ.మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు.

Published : 02 Jul 2024 04:28 IST

భాజపా పక్షనేత మహేశ్వర్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయమని భాజపా శాసనసభా పక్షనేత ఎ.మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నపుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇళ్ల ముందు డప్పులు కొట్టమని చెప్పిన రేవంత్‌.. ఇప్పుడు స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం శోచనీయమని మండిపడ్డారు. సోమవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ముథోల్‌ ఎమ్మెల్యే రామారావుపటేల్‌తో కలిసి మహేశ్వర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘ఓ పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం చరిత్రలోనే లేదు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై స్పీకర్‌కు అనర్హత పిటిషన్‌ పంపుతున్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పార్టీ మారిన వారిపై 90 రోజుల్లో చర్య తీసుకోవాలి. భాజపాలో చేరేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు. పదవులకు రాజీనామా చేసి వస్తేనే చేర్చుకుంటాం’’ అని మహేశ్వర్‌రెడ్డి ప్రకటించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని