కాంగ్రెస్, ఉద్ధవ్‌లతో కలిసే ఎన్నికలకు: శరద్‌పవార్‌

త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (యూబీటీ), కాంగ్రెస్‌తో కలిసే బరిలోకి దిగుతామని ఎన్సీపీ(ఎస్‌పీ) అధినేత శరద్‌పవార్‌ స్పష్టం చేశారు.

Published : 01 Jul 2024 04:31 IST

పుణె: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (యూబీటీ), కాంగ్రెస్‌తో కలిసే బరిలోకి దిగుతామని ఎన్సీపీ(ఎస్‌పీ) అధినేత శరద్‌పవార్‌ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన పుణెలో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో తమకు మంచి స్పందన వచ్చిందని, రాష్ట్రంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహా వికాస్‌ అఘాడీ కూటమిలో భాగస్వాములుగా ఉన్న వామపక్షాలు, పీడబ్ల్యూపీ వంటి మిత్రపక్షాల ప్రయోజనాల్ని పరిరక్షించడం తమ నైతిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్పందిస్తూ.. ‘‘మీరు ఖాళీ జేబుతో మార్కెట్‌కు వెళితే ఏం జరుగుతుంది? ఇంకొద్ది రోజులు ఆగండి’’ అని పవార్‌ ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని