విద్యుత్‌ రంగం ప్రైవేటీకరణకు కుట్రలు

రాష్ట్రంలో విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు.

Published : 01 Jul 2024 03:06 IST

మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపణ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘విద్యుత్‌ బిల్లుల వసూలును అదానీకి అప్పగించేందుకు రేవంత్‌ సర్కారు నిర్ణయం తీసుకోబోతోంది. పాతబస్తీలో 45 శాతం మాత్రమే కరెంటు బిల్లులు వసూలవుతున్నందున ప్రైవేటుకు ఇస్తున్నామని రేవంత్‌ చెబుతున్నారు. ఇది పాతబస్తీ ప్రజలను అవమానించడమే. ఇది కేవలం పాతబస్తీలో పైలట్‌ ప్రాజెక్టుకే పరిమితం కాదు. రాష్ట్రం మొత్తం విద్యుత్‌ బిల్లుల వసూలు ప్రైవేటు చేతుల్లోకి వెళ్తుంది. రైతులకు ఉచిత కరెంటు, రాయితీలుండవు. మోటార్లకు మీటర్లు పెడతారు. మోదీ, అదానీ విధానాలను తెలంగాణలో రేవంత్‌ అమలు చేస్తున్నారు. ప్రైవేటు వాళ్లకు అప్పగిస్తే విద్యుత్‌ వ్యవస్థ నాశనమవుతుంది’’ అని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని