రాహుల్‌జీ.. ఉద్యోగ క్యాలెండర్‌ ప్రకటించండి

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తి కావచ్చినా.. ఇప్పటి వరకూ ఉద్యోగ క్యాలెండర్‌ ప్రకటించలేదని, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కోరారు.

Published : 01 Jul 2024 03:02 IST

‘ఎక్స్‌’లో కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తి కావచ్చినా.. ఇప్పటి వరకూ ఉద్యోగ క్యాలెండర్‌ ప్రకటించలేదని, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కోరారు. రాహుల్‌నుద్దేశించి ‘ఎక్స్‌’ వేదికగా ఆదివారం కేటీఆర్‌ పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రియమైన రాహుల్‌గాంధీజీ.. మీరు వ్యక్తిగతంగా నిరుద్యోగులను కలిశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని పూర్తి చేస్తామని తెలంగాణ యువకులకు హామీ ఇచ్చారు. మీ వాగ్దానాన్ని అనుసరించే తేదీలతో పాటు అన్ని ప్రముఖ వార్తాపత్రికల్లో ‘ఉద్యోగ క్యాలెండర్‌’ కూడా మీ పార్టీ ప్రచురించింది. ఇప్పటికి 7 నెలలు దాటిపోయినా..నూతన ఉద్యోగ నోటిఫికేషన్‌ కూడా జారీ చేయలేదు. ఎలాంటి నోటిఫికేషన్‌లు జారీ చేయకుండానే 2 లక్షల రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను మీ ప్రభుత్వం ఎలా అందిస్తుంది? తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యులు ఎవరూ పట్టించుకోనందున దయచేసి స్పందించండి’’ అని కేటీఆర్‌ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని