భారాస హయాంలో రైతుబంధు దుర్వినియోగం: ఎమ్మెల్యే యెన్నం

భారాస ప్రభుత్వ హయాంలో 42 లక్షల ఎకరాలకు సంబంధించి రైతుబంధు దుర్వినియోగమైందని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు.

Updated : 30 Jun 2024 05:32 IST

హైదరాబాద్, న్యూస్‌టుడే: భారాస ప్రభుత్వ హయాంలో 42 లక్షల ఎకరాలకు సంబంధించి రైతుబంధు దుర్వినియోగమైందని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం సాగు చేసే ప్రతి ఎకరాకు రైతుభరోసా ఇస్తుందని చెప్పారు. శనివారం ఆయన అసెంబ్లీలోని సీఎల్పీ మీడియా హాలులో మాట్లాడారు. జ్యుడిషియల్‌ విచారణ నుంచి కేసీఆర్‌ తప్పించుకోలేరని పేర్కొన్నారు. దిల్లీ మద్యం కేసులో జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత అప్రూవర్‌గా మారేందుకు సిద్ధపడుతుండగా కుటుంబసభ్యులు అడ్డుకుంటున్నట్లు తెలుస్తోందని చెప్పారు. అందుకే హరీశ్‌రావు, కేటీఆర్‌ దిల్లీ వెళ్లి అప్రూవర్‌గా మారొద్దంటూ కవితకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ కళ్లలో కళ్లు పెట్టి చూసే ధైర్యం కేసీఆర్‌కు లేదని, అందుకే ఆయన రాష్ట్రానికి వస్తే ఆహ్వానించలేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి.. మోదీని కలిసి ప్రత్యేక నిధుల కోసం ప్రయత్నం చేస్తున్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని