రాహుల్‌ మైక్‌ను మ్యూట్‌ చేశారు: కాంగ్రెస్‌

లోక్‌సభలో శుక్రవారం ‘నీట్‌ పేపర్‌ లీక్‌’ వ్యవహారాన్ని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ లేవనెత్తగానే మైక్‌ ఆపేశారని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా ఓ వీడియోను షేర్‌ చేసింది.

Updated : 29 Jun 2024 06:00 IST

- ఖండించిన స్పీకర్‌ ఓం బిర్లా

దిల్లీ: లోక్‌సభలో శుక్రవారం ‘నీట్‌ పేపర్‌ లీక్‌’ వ్యవహారాన్ని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ లేవనెత్తగానే మైక్‌ ఆపేశారని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా ఓ వీడియోను షేర్‌ చేసింది. మైక్రోఫోన్‌లో మాట్లాడేందుకు వీలు కల్పించాలంటూ స్పీకర్‌ ఓం బిర్లాను రాహుల్‌ కోరడం ఆ దృశ్యాల్లో కనిపిస్తోంది. ‘‘నీట్‌పై ప్రధాని మోదీ ఏం మాట్లాడటం లేదు. సభలో యువత తరఫున రాహుల్‌ తన గొంతు వినిపిస్తున్నారు. కానీ అలాంటి తీవ్రమైన అంశంలో కూడా మైక్‌ ఆఫ్‌ చేయడం వంటి చౌకబారు పనులకు పాల్పడి, యువత గొంతు నొక్కేందుకు కుట్ర చేస్తున్నారు’’ అంటూ కాంగ్రెస్‌ తన ఖాతాల్లో రాసుకొచ్చింది. దీనిపై తాను ఎంపీల మైక్రోఫోన్‌ స్విచ్చాఫ్‌ చేయనని, అలాంటి నియంత్రణ ఏదీ తన వద్ద లేదని స్పీకర్‌ ఓం బిర్లా స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరగాల్సిన సమయంలో ఇతర విషయాలు రికార్డు కావని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని