పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు: జగ్గారెడ్డి

పీసీసీ అధ్యక్ష పదవిని అధిష్ఠానం ఎవరికిచ్చినా తనకు అభ్యంతరం లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

Published : 29 Jun 2024 04:36 IST

హైదరాబాద్, న్యూస్‌టుడే: పీసీసీ అధ్యక్ష పదవిని అధిష్ఠానం ఎవరికిచ్చినా తనకు అభ్యంతరం లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం గాంధీభవన్‌లో పీసీసీ షిషర్‌మెన్‌ కమిటీ ఛైర్మన్‌ మెట్టు సాయికుమార్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధ్యక్ష పదవికి సంబంధించి తనను ఎవరూ సంప్రదించలేదన్నారు. సోనియా, రాహుల్‌గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా విధేయుడిగా ఉంటానని, చివరికి అటెండర్‌గా పని చేయమన్నా చేస్తానన్నారు. పదేళ్లలో తప్పకుండా పీసీసీ అధ్యక్షుడిని అవుతా, ముఖ్యమంత్రిని కూడా అవుతానని విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ ఎన్నికల హామీలను ఏ విధంగా అమలు చేస్తారో చెప్పకుండా.. ఎమర్జెన్సీ గురించి మాట్లాడటం దురదృష్టకరమని జగ్గారెడ్డి విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని