భారాస చేజారిన నల్గొండ డీసీసీబీ పీఠం

నల్గొండ డీసీసీబీ పీఠం భారాస చేజారింది. భారాసకి చెందిన ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డిపై కాంగ్రెస్‌తోపాటు సొంత పార్టీకి చెందిన వారు మొత్తం 14 మంది డైరెక్టర్లు 20 రోజుల క్రితం అవిశ్వాసానికి నోటీసులిచ్చారు.

Published : 29 Jun 2024 04:35 IST

ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డిపై నెగ్గిన అవిశ్వాస తీర్మానం
జులై 1న కొత్త ఛైర్మన్‌ ఎన్నిక

ఈనాడు, నల్గొండ: నల్గొండ డీసీసీబీ పీఠం భారాస చేజారింది. భారాసకి చెందిన ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డిపై కాంగ్రెస్‌తోపాటు సొంత పార్టీకి చెందిన వారు మొత్తం 14 మంది డైరెక్టర్లు 20 రోజుల క్రితం అవిశ్వాసానికి నోటీసులిచ్చారు. దీంతో జిల్లా సహకార అధికారి కిరణ్‌ కుమార్‌ శుక్రవారం అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహించారు. అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చిన 14 మంది డైరెక్టర్లతోపాటు డీసీసీబీ ఉపాధ్యక్షుడు దయాకర్‌రెడ్డి సైతం మద్దతు పలికారు. దీంతో 15 మంది మద్దతుతో తీర్మానం నెగ్గి మహేందర్‌రెడ్డి పదవీచ్యుతుడు అయినట్లు ప్రత్యేక అధికారి కిరణ్‌ కుమార్‌ ప్రకటించారు. మొత్తం 19మంది డైరెక్టర్లలో భారాసకు చెందిన నలుగురు హాజరు కాలేదు. జులై 1న కొత్త ఛైర్మన్‌ ఎన్నిక నిర్వహించనున్నారు. అప్పటి వరకు వైస్‌ఛైర్మన్‌ దయాకర్‌రెడ్డి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి సన్నిహితుడైన కుంభం శ్రీనివాస్‌రెడ్డి డీసీసీబీ కొత్త ఛైర్మన్‌ కావడం లాంఛనమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని