పిట్రోడాను మళ్లీ తీసుకొస్తారని మోదీ ఆనాడే చెప్పారు

వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కాంగ్రెస్‌ నేత శాం పిట్రోడాకు ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ ఛైర్మన్‌గా మళ్లీ బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది.

Published : 28 Jun 2024 05:09 IST

కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు

దిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కాంగ్రెస్‌ నేత శాం పిట్రోడాకు ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ ఛైర్మన్‌గా మళ్లీ బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది. దీనిపై కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు స్పందిస్తూ.. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఇలా జరుగుతుందని ప్రధాని మోదీ ఆనాడే చెప్పారని గుర్తుచేశారు. ‘‘రూపురేఖలనుద్దేశిస్తూ భారతీయులను అవమానపర్చిన రాహుల్‌ గాంధీ సలహాదారు పిట్రోడాను మళ్లీ కీలక బాధ్యతల్లోకి తీసుకున్నారు. ఇది మమ్మల్ని ఆశ్చర్యపర్చలేదు. ఎందుకంటే ప్రధాని మోదీ దీన్ని ముందుగానే ఊహించారు’’ అని రిజిజు రాసుకొచ్చారు. దీంతోపాటు ఓ ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతున్న వీడియోను జత చేశారు. అటు భాజపా కూడా ఈ వీడియోను పోస్ట్‌ చేసింది. భాజపా అధికారప్రతినిధి షెహజాద్‌ పూనావాలా కూడా స్పందిస్తూ తాజా చర్యతో పిట్రోడా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ సమర్థించినట్లైందని పేర్కొన్నారు. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలతో తమకు సంబంధంలేదని హస్తం పార్టీ పేర్కొనడం కేవలం దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మాత్రమేనని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు