మోదీపైనే సంసద్‌ టీవీ ఫోకస్‌: కాంగ్రెస్‌

పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తున్న సమయంలో ప్రధాని మోదీని ఎక్కువ సార్లు ‘సంసద్‌ టీవీ’లో చూపించారంటూ కాంగ్రెస్‌ పార్టీ ఆక్షేపించింది.

Published : 28 Jun 2024 05:09 IST

 దిల్లీ: పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తున్న సమయంలో ప్రధాని మోదీని ఎక్కువ సార్లు ‘సంసద్‌ టీవీ’లో చూపించారంటూ కాంగ్రెస్‌ పార్టీ ఆక్షేపించింది. పార్లమెంటు కార్యక్రమాలను సంసద్‌ టీవీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. లోక్‌సభ, రాజ్యసభ టీవీ ఛానళ్లను విలీనం చేసి 2021లో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. ‘‘రాష్ట్రపతి ప్రసంగం సమయంలో సంసద్‌ టీవీ ప్రధాని మోదీపైనే ఫోకస్‌ పెట్టింది. ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని టీవీలో కేవలం ఆరు సార్లు చూపించగా.. మోదీని 73 సార్లు చూపించింది. అధికార పార్టీ నేతలను 108 సార్లు.. ప్రతిపక్ష నేతలను 18 సార్లు చూపించారు. సంసద్‌ టీవీ సభా కార్యక్రమాలను కవర్‌ చేయాలే గానీ.. స్వామి భక్తి చూపకూడదు’’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని