భారాస, భాజపా కుమ్మక్కయ్యాయనడం విడ్డూరం: హరీశ్‌రావు

పార్లమెంటు ఎన్నికల్లో భారాస, భాజపా కుమ్మక్కయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Published : 28 Jun 2024 04:08 IST

హైదరాబాద్, న్యూస్‌టుడే: పార్లమెంటు ఎన్నికల్లో భారాస, భాజపా కుమ్మక్కయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘మెదక్‌లో భాజపాను భారాసనే గెలిపించిందని సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడటం సరికాదు. మెదక్‌ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు చోట్ల భారాస మెజారిటీ సాధించింది. సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో భాజపాకు ఆధిక్యం రాగా.. సొంత నియోజకవర్గమైన మహబూబ్‌నగర్‌లో వారి పార్టీ అభ్యర్థి ఓడిపోయారు. మరి ఆయనే అక్కడ కాంగ్రెస్‌ ఓట్లు మళ్లించారా? రేవంత్‌రెడ్డి గతంలో ఎంపీగా ఉన్న మల్కాజిగిరిలో భాజపా భారీ మెజారిటీతో ఎలా గెలిచింది? కేంద్రం పంచన చేరింది, మోదీ శరణు కోరింది రేవంత్‌రెడ్డే. వారిద్దరు కుమ్మక్కై సింగరేణిని ప్రైవేటుపరం చేస్తున్నారు’ అని హరీశ్‌రావు ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని