సింగరేణి గనుల వేలానికి వ్యతిరేకంగా ఆందోళనలు

తెలంగాణ గడ్డపై ఉన్న ప్రతి బొగ్గుపెళ్ల సింగరేణికే దక్కుతుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేత రాజిరెడ్డి అన్నారు. సింగరేణిని కాదని రాష్ట్రంలోని  గనులను వేలం వేస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టంచేశారు.

Published : 28 Jun 2024 04:07 IST

తెబొగకాసం నేత రాజిరెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ గడ్డపై ఉన్న ప్రతి బొగ్గుపెళ్ల సింగరేణికే దక్కుతుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేత రాజిరెడ్డి అన్నారు. సింగరేణిని కాదని రాష్ట్రంలోని  గనులను వేలం వేస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేలం నిర్వహణకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి కాంగ్రెస్‌ సహకరిస్తోందని ఆరోపించారు. ‘‘సింగరేణి తెలంగాణ ప్రజల సంస్థ. దానిలో సాంకేతికంగా మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉంది. ప్రస్తుతం సంస్థ ఉనికి కోల్పోయే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది.  కోల్‌ఇండియాలో వేలం లేకుండానే బొగ్గుబావులను తీసుకుంటున్నారు. సింగరేణికి కూడా వేలం లేకుండా  కేటాయించాలి. బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా జులై 1న నల్లబ్యాడ్జీలతో నిరసన.. 3న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మల దహనం.. 6న జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా.. 9న గోదావరిఖనిలో భారీస్థాయిలో ధర్నా నిర్వహిస్తాం. రెండో దశలో భాగంగా అసెంబ్లీ సమావేశాల్లో కోల్‌బెల్ట్‌ ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇస్తాం. ఇందిరాపార్క్‌ దగ్గర ధర్నా చేస్తాం. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా దిల్లీలో జంతర్‌మంతర్‌ దగ్గర ఆందోళన చేపడతాం..’ అని రాజిరెడ్డి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని