అధికారంలోకి వచ్చాక మేమేంటో చూపిస్తాం: కౌశిక్‌రెడ్డి

ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Published : 28 Jun 2024 04:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ఇవాళ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. రేపు మేము అధికారంలోకి వచ్చాక మేమేంటో చూపిస్తాం. కావాలంటే నన్ను ఇబ్బందిపెట్టండి. కానీ హుజూరాబాద్‌ ప్రజలను ఇబ్బందిపెట్టొద్దు. కల్యాణలక్ష్మి చెక్కులను శాసనసభ్యులు పంపిణీ చేయవచ్చని హైకోర్టు చెప్పినా.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ అడ్డుకుంటున్నారు’’ అని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని