కాంగ్రెస్‌ ప్రత్యేక కార్యాచరణ ఫలితమే ‘సీతారామ’కు గోదావరి జలకళ

కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ ఫలితమే.. సీతారామ ప్రాజెక్టులో గోదావరి జలకళ.. అని తెలంగాణ కాంగ్రెస్‌ పేర్కొంది.

Published : 28 Jun 2024 04:06 IST

కేటీఆర్‌ ట్వీట్‌పై కాంగ్రెస్‌ స్పందన

హైదరాబాద్, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ ఫలితమే.. సీతారామ ప్రాజెక్టులో గోదావరి జలకళ.. అని తెలంగాణ కాంగ్రెస్‌ పేర్కొంది. ‘సాగునీటి రంగంలో కేసీఆర్‌ కృషికి సీతారామ ప్రాజెక్టు మరో నిదర్శనం..’ అంటూ మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ గురువారం ‘ఎక్స్‌’లో చేసిన పోస్టుకు తెలంగాణ కాంగ్రెస్‌ బదులిచ్చింది. సీతారామ ప్రాజెక్టుపై భారాస తప్పుడు ప్రచారం చేస్తోందని ఆక్షేపించింది. ‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం 2014లోనే రూ.3 వేల కోట్ల అంచనా వ్యయంతో సీతారామ ప్రాజెక్టును మొదలుపెట్టింది. తర్వాత అధికారంలోకి వచ్చిన భారాస ప్రభుత్వం కమీషన్ల కోసం రీడిజైన్‌ పేరుతో అంచనా వ్యయాన్ని రూ.18,500 కోట్లకు పెంచి పదేళ్లు ఆలస్యం చేసింది. ప్రాజెక్టుకు అనుమతులు, భూసేకరణ, బాధితులకు పునరావాసం కల్పనలో నిర్లక్ష్యం చేసింది. భారాస నేతలు మాత్రం అందినకాడికి దోచుకున్నారు. మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక.. ఈ ఏడాది జనవరి 7న ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించి, ఆరు నెలల్లో పనులు పూర్తయ్యేలా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు’’ అని తెలంగాణ కాంగ్రెస్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని