ఎమ్మెల్సీ దండె విఠల్‌తో కాంగ్రెస్‌ చర్చలు!

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు ఆ పార్టీ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఆయనను పార్టీలో చేర్చుకోవటం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భారాసను దెబ్బకొట్టాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.

Published : 27 Jun 2024 03:39 IST

ఈటీవీ, ఆదిలాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు ఆ పార్టీ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఆయనను పార్టీలో చేర్చుకోవటం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భారాసను దెబ్బకొట్టాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. విఠల్‌తో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఒకరిద్దరు పెద్దలు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ విషయమై ఆయనను ఫోన్లో సంప్రదించగా.. ‘‘నేనొక ఎమ్మెల్సీని. నాతో ఏ పార్టీ నేతలైనా మాట్లాడటానికి, కలవడానికి ఆస్కారం ఉంటుంది. అందులో తప్పు లేదు. పార్టీ మారే విషయంలో ఎలాంటి చర్చ జరగలేదు. ప్రస్తుతానికైతే నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని