అవినీతిని మంత్రి పొన్నం పరోక్షంగా అంగీకరించినట్లే

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ నీతిమంతుడైతే హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రమాణం చేయడానికి ఎందుకు రాలేదని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు.

Published : 27 Jun 2024 06:00 IST

ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి విమర్శలు

ఆలయం వద్ద ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి

ఫిలింనగర్, న్యూస్‌టుడే: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ నీతిమంతుడైతే హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రమాణం చేయడానికి ఎందుకు రాలేదని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. అవినీతికి పాల్పడకపోతే ప్రమాణం చేయాలని మంత్రికి సవాల్‌ విసిరిన కౌశిక్‌రెడ్డి బుధవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మంత్రి పొన్నం ప్రభాకర్‌ నా సవాల్‌ను స్వీకరించి ఫ్లైయాష్‌ రవాణాలో అవినీతికి పాల్పడలేదని ఆలయానికి వచ్చి ప్రమాణం చేస్తారని భావించాను. ఈ విషయంలో పొన్నం రూ.100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని నేను ఆరోపిస్తే ఆయన ఇప్పటివరకు పెదవి విప్పలేదు. దీనిపై ఆయన పంపిన లీగల్‌ నోటీసులకు భయపడేవారు ఎవరూ లేరు. నా సవాలును స్వీకరించలేదంటే అవినీతికి పాల్పడ్డానని ఆయన పరోక్షంగా అంగీకరించినట్లే. ఫ్లైయాష్‌ లారీలను స్వయంగా నేనే హుజూరాబాద్‌లో పట్టుకున్నా. అధికారులు, మంత్రులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. వారందరి వివరాలు బ్లాక్‌బుక్‌లో నమోదు చేస్తున్నా. మళ్లీ సీఎంగా కేసీఆర్‌ వస్తారు. అప్పుడు వారికి శిక్షలు తప్పవు. బ్లాక్‌బుక్‌లో మొట్టమొదటి పేరు పొన్నం ప్రభాకర్‌దే’’ అని కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని