సైనిక్‌ స్కూల్‌పై రేవంత్‌రెడ్డి అబద్ధాలు

సీఎం స్థానంలో ఉండి రేవంత్‌రెడ్డి సైనిక్‌ స్కూల్‌పై అబద్ధాలు మాట్లాడారని భారాస సీనియర్‌ నేత, మాజీ ఎంపీ బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Published : 26 Jun 2024 05:39 IST

మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ ఆరోపణ

ఈనాడు, హైదరాబాద్‌: సీఎం స్థానంలో ఉండి రేవంత్‌రెడ్డి సైనిక్‌ స్కూల్‌పై అబద్ధాలు మాట్లాడారని భారాస సీనియర్‌ నేత, మాజీ ఎంపీ బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘సైనిక్‌ స్కూల్‌పై కేసీఆర్‌ పట్టించుకోలేదని రేవంత్‌ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. సీఎం కార్యాలయంలో కేసీఆర్‌ కేంద్రానికి రాసిన ఉత్తరాలుంటాయి. వాటిని రేవంత్‌ ఓసారి చూడాలి. వరంగల్‌లో సైనిక్‌ స్కూల్‌ను ఎప్పుడో మంజూరు చేశారు. రక్షణ శాఖ ఆధ్వర్యంలో సైనిక్‌ స్కూళ్లు ఇక ముందు నడపలేమని, భూమితో సహా సిబ్బంది జీత భత్యాలు, రోజు వారీ వ్యయం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని రక్షణ శాఖ షరతులు విధిస్తే వాటిని సడలించాలని కేసీఆర్‌ కేంద్రానికి అనేక సార్లు లేఖలు రాశారు. రక్షణశాఖ భూములపై కూడా కేసీఆర్‌ చేసిన ప్రయత్నాలు రికార్డుల్లో ఉన్నాయి. ఇకపై రేవంత్‌ అబద్ధాలకు దీటుగా బదులిస్తాం’’ అని వినోద్‌కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు