హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం

అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఆ హామీలను అమలుచేయడంలో విఫలమైందని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.

Published : 26 Jun 2024 05:38 IST

మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఆ హామీలను అమలుచేయడంలో విఫలమైందని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణభవన్‌లో మంగళవారం మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, శాట్స్‌ మాజీ ఛైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డిలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘లోక్‌సభ ఎన్నికలు నా పాలనకు రెఫరండం అన్న రేవంత్‌ మాటకు దిక్కు లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ వైఫల్యంపై ఆ పార్టీ అధిష్ఠానమే కమిటీ వేసింది. భారాస ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా తప్పును సరిదిద్దుకోలేరు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలనివ్వను అన్న రేవంత్‌ ఇప్పుడు ఇంటింటికీ తిరిగి కండువాలు కప్పుతున్నారు. వైఎస్‌ హయాంలోనూ ఎంతో మంది ఎమ్మెల్యేలను లాక్కున్నారు. కానీ తెలంగాణను ఆపలేకపోయారు. రాష్ట్రాన్ని నిరంతరం కాపాడుకుంటాం. భాజపా విజయానికి భారాస సహకరించిందని కాంగ్రెస్‌ చెప్పడానికి సిగ్గుండాలి. రేవంత్‌ సొంతూరు కొండారెడ్డిపల్లిలోనే భాజపాకు ఆధిక్యం వచ్చింది’’ అని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని