ఎమర్జెన్సీతో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్‌ అపహాస్యం చేసింది!

‘రాత్రికి రాత్రి ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన కాంగ్రెస్‌ పార్టీ నేడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి మాట్లాడటం తగదని’ భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విమర్శించారు.

Published : 26 Jun 2024 05:37 IST

భాజపా నేత లక్ష్మణ్‌

ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినవారితో రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్, పార్టీ నేతలు కాసం వెంకటేశ్వర్లు, డాక్టర్‌ ఎన్‌.గౌతంరావు

బర్కత్‌పుర, న్యూస్‌టుడే: ‘రాత్రికి రాత్రి ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన కాంగ్రెస్‌ పార్టీ నేడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి మాట్లాడటం తగదని’ భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విమర్శించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన కొన్ని రాజకీయ పార్టీలు సైతం కాంగ్రెస్‌ పార్టీకి వత్తాసు పలకడం దారుణమన్నారు. దీన్ని గురించి తెజస అధ్యక్షుడు కోదండరాం కూడా మాట్లాడటం లేదని పేర్కొన్నారు. భాజపా ఆధ్వర్యంలో మంగళవారం బర్కత్‌పురలోని నగర పార్టీ కార్యాలయంలో ఎమర్జెన్సీ వ్యతిరేక సభ నిర్వహించారు. భాజపా హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.గౌతంరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన సమరయోధులను సత్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ ఎమర్జెన్సీపై కాంగ్రెస్‌ కమ్యూనిస్టు పార్టీల నేతలు నేటికీ పశ్చాత్తాపం ప్రకటించడం లేదన్నారు. నరేంద్ర మోదీ మూడోసారి గెలిస్తే ఎన్నికలు ఉండవని, రిజర్వేషన్లు తొలగిస్తారని ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో ఫేక్‌ వీడియోల ద్వారా ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తుందే తప్ప తొలగించదన్నారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, మహంకాళి జిల్లా అధ్యక్షుడు బి.శ్యామ్‌సుందర్‌గౌడ్, మాజీ మంత్రి సి.కృష్ణాయాదవ్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీపై పోరాడిన వెంకటరమణి, బొల్లంపల్లి మోహన్‌రెడ్డి, సురేశ్‌ లాహోటీ, రాంచందర్‌రావు, డాక్టర్‌ కంటు సత్యనారాయణలను సత్కరించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్‌ తివారీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక సమావేశం నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు