తెలుగు ప్రజల దయాదాక్షిణ్యాలతో మోదీకి అధికారం: కూనంనేని

సార్వత్రిక ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలుస్తామని చెప్పిన ప్రధాని మోదీ 240 సీట్లకే పరిమితమై.. తెలుగు రాష్ట్రాల ప్రజల దయాదాక్షిణ్యాలతో కేంద్రంలో అధికారం చెలాయిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

Published : 26 Jun 2024 05:36 IST

కరీంనగర్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలుస్తామని చెప్పిన ప్రధాని మోదీ 240 సీట్లకే పరిమితమై.. తెలుగు రాష్ట్రాల ప్రజల దయాదాక్షిణ్యాలతో కేంద్రంలో అధికారం చెలాయిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం కరీంనగర్‌లో ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్రస్థాయి 3 రోజుల శిక్షణ తరగతుల ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సొంతంగా బలం లేని భాజపా ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక రాజధాని, పోలవరం ప్రాజెక్టు, తెలంగాణలో బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్‌ నిర్మాణం తదితర హామీలను ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, హక్కులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సాధించాలని కోరారు. సింగరేణిలో రాష్ట్ర వాటా సగం వరకు ఉండగా, కేంద్రం ఎలా ప్రైవేటుపరం చేస్తుందని కిషన్‌రెడ్డి చెబుతున్నారని.. కానీ, ఇప్పటికే ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగులతో ప్రైవేటీకరణ అయిపోయిందన్నారు. ‘నీట్‌’ పేపర్‌ లీకేజీకి బాధ్యత వహించి.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు