నయవంచనకు ప్రతిరూపమే కాంగ్రెస్‌: కేటీఆర్‌

ఓ వైపు రాజ్యాంగ పరిరక్షణ అంటూనే మరోవైపు పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్‌ పార్టీ ప్రోత్సహిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మండిపడ్డారు.

Published : 26 Jun 2024 05:36 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఓ వైపు రాజ్యాంగ పరిరక్షణ అంటూనే మరోవైపు పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్‌ పార్టీ ప్రోత్సహిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మండిపడ్డారు. నయవంచనకు ప్రతిరూపమే కాంగ్రెస్‌ అంటూ మంగళవారం ‘ఎక్స్‌’ వేదికగా కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. ‘‘పౌర, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రజల గొంతులను అణచి వేస్తూ 49 సంవత్సరాల క్రితం ఇదే రోజు కాంగ్రెస్‌ పార్టీ దేశంలో ఎమర్జెన్సీ విధించింది. ఇన్ని దశాబ్దాలు గడిచినా సరే కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామ్యంపై అదే దాడిని కొనసాగిస్తోంది. ఓ వైపు రాజ్యాంగ పరిరక్షణ అంటూ పార్లమెంట్‌లో రాజ్యాంగ కాపీలను ఆ పార్టీ నేతలు చేత పట్టుకొని ప్రదర్శన చేస్తారు. మరోవైపు అదే పార్లమెంట్‌కు కొద్ది దూరంలోనే ఉన్న వాళ్ల పార్టీ ఆఫీస్‌లో రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసే విధంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ హిపోక్రసీ చూస్తుంటే ఆవేదన కలుగుతోంది’’ అని కేటీఆర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు