మోదీ విధానాలను రేవంత్‌ అనుసరిస్తున్నారు: జగదీశ్‌రెడ్డి

భాజపాపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ దాడి చేస్తుంటే.. ఇక్కడ రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి మోదీ విధానాలను అనుసరిస్తున్నారని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు.

Published : 26 Jun 2024 05:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: భాజపాపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ దాడి చేస్తుంటే.. ఇక్కడ రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి మోదీ విధానాలను అనుసరిస్తున్నారని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘భారాస బీ ఫారమ్‌పై గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్‌లు కాంగ్రెస్‌లో చేరారు. వారి శాసనసభ సభ్యత్వాలు రద్దు కావాల్సి ఉంది. పార్టీ మారిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం’’ అని జగదీశ్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని