ఈ చాయ్‌వాలా అదృష్టం ఎలా ఉందో!

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ నగరంలో టీకొట్టు నడుపుతూ జీవనం సాగిస్తున్న ఆనంద్‌సింగ్‌ కుశ్వాహా 28వ ప్రయత్నంగా తాజా ఎన్నికల్లో తన నామినేషను వేశారు.

Published : 27 Oct 2023 04:33 IST

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ నగరంలో టీకొట్టు నడుపుతూ జీవనం సాగిస్తున్న ఆనంద్‌సింగ్‌ కుశ్వాహా 28వ ప్రయత్నంగా తాజా ఎన్నికల్లో తన నామినేషను వేశారు. 1994 మొదలు పురపాలక, లోక్‌సభ, అసెంబ్లీ.. ఇలా ప్రతి ఎన్నికలోనూ బరిలోకి దిగుతున్న ఈయన ప్రస్తుత పోటీలో బీఎస్పీ అభ్యర్థిగా గ్వాలియర్‌ తూర్పు నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తలకు టోపీ నుంచి కాళ్లకు వేసుకున్న జోళ్ల దాకా మొత్తం నీలిరంగు (బీఎస్పీ రంగు) ఆహార్యంతో సైకిలుపై గురువారం కలెక్టరేటుకు చేరుకొన్న ఆనంద్‌సింగ్‌ ఉత్సాహంగా నామినేషను పత్రాలు దాఖలు చేశారు. ‘‘చాయ్‌ అమ్మిన వ్యక్తి ఈ దేశానికి ప్రధాని అయ్యారు. నేను ఎంపీ లేదా ఎమ్మెల్యే కాలేనా? ఏదో ఒకరోజు తప్పక ఎన్నికవుతాను’’ అంటారాయన. ‘ఈటీవీ భారత్‌’తో ఆనంద్‌సింగ్‌ మాట్లాడుతూ..‘‘గతంలో మా వర్గానికి చెందిన రాష్ట్ర మాజీ మంత్రి నారాయణసింగ్‌ కుశ్వాహాతో కౌన్సిలరు ఎన్నిక విషయంలో పోటీ పడ్డాను. ఆ ఎన్నికల్లో నేను ఓడిపోయినా, ప్రతి ఎన్నికలోనూ పోటీ చేయాలని ఆరోజే నిర్ణయించుకున్నా’’ అని తన సంకల్పాన్ని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని