Ganta Srinivasarao: జగన్‌.. అలాంటి ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదు: గంటా శ్రీనివాసరావు

ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) ప్రతిష్ఠను జగన్‌ దిగజార్చారని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు.

Published : 28 Jun 2024 14:49 IST

విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) ప్రతిష్ఠను జగన్‌ దిగజార్చారని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. వీసీగా కరుడుకట్టిన వైకాపా వాదిని నియమించారని ఆరోపించారు. ఈ మేరకు గంటా శ్రీనివాసరావు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. గాంధీ విగ్రహం పక్కనే వైఎస్‌ విగ్రహం పెట్టించారని.. యూనివర్సిటీని జగన్‌ పార్టీ కార్యాలయంగా వీసీ మార్చేశారన్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో వర్సిటీకి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. 

‘‘ఏయూ అంటే ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉండేది. విద్యా ప్రమాణాల పరంగా ఎక్కడికి వెళ్లినా ఏయూ పట్టా అంటే చాలా విలువ ఇచ్చేవాళ్లు. వైకాపా అధికారంలోకి వచ్చాక విద్యా ప్రమాణాలు పడిపోయి.. ఎన్నడూ లేనంతగా నాణ్యత దిగజారిపోయేలా చేశారు. పవిత్రమైన విద్యా సంస్థను ఫక్తు రాజకీయ కేంద్రంగా మార్చేశారు. రూ.కోట్ల నిధులను స్వాహా చేశారు. జగన్‌.. దేవాలయంలాంటి యూనివర్సిటీని భ్రష్టు పట్టించిన ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదు’’ అని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని