KCR: ఆ కేసు కొట్టేయండి.. హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్‌

భారాస అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో రైల్‌ రోకో సందర్భంగా తనపై నమోదైన కేసు విషయంలో ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. 

Updated : 24 Jun 2024 20:20 IST

హైదరాబాద్‌: భారాస అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో రైల్‌ రోకో సందర్భంగా తనపై నమోదైన కేసు విషయంలో ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రజాప్రతినిధుల కోర్టులో తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011 అక్టోబర్‌లో రైల్‌ రోకోకు కేసీఆర్‌ పిలుపునిచ్చారంటూ మల్కాజ్‌గిరి పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు, రైల్వే ఉద్యోగులకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కేసీఆర్‌.. ఎలాంటి రైల్‌ రోకోకు పిలుపునివ్వలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎవరో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసులు నమోదు చేశారన్నారు. రైల్‌ రోకో ఘటన తర్వాత మూడేళ్లకు తెలంగాణ ఏర్పడిందని, ఈ కేసుకు ఎలాంటి బలం లేదని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని