Dwarampudi: మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం

కాకినాడ నగరపాలకసంస్థ పరిధిలో వైకాపా నాయకుడికి చెందిన అక్రమ కట్టడం కూల్చివేతను మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన అనుచరులతో కలసి అడ్డుకున్నారు.

Updated : 03 Jul 2024 06:50 IST

అక్రమ కట్టడం కూల్చివేత అడ్డగింత
మున్సిపల్‌ సిబ్బందిపై అనుచరుల దాడి

ఘటనా స్థలం నుంచి వెనుతిరుగుతున్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి

కాకినాడ కలెక్టరేట్, సాంబమూర్తినగర్, న్యూస్‌టుడే: కాకినాడ నగరపాలకసంస్థ పరిధిలో వైకాపా నాయకుడికి చెందిన అక్రమ కట్టడం కూల్చివేతను మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి న అనుచరులతో కలసి అడ్డుకున్నారు. ఆ పార్టీ నాయకుడు బళ్లా సూరిబాబు స్థానిక రాజ్యలక్ష్మీనగర్‌లో నగరపాలకసంస్థ అనుమతి లేకుండా జి+1 భవనంపై మరో అంతస్తు నిర్మించారు. దానిని తొలగించాలని నగరపాలక సంస్థ నోటీసు జారీచేసింది. ఆయన స్పందన లేకపోవడంతో మంగళవారం నగరపాలక టౌన్‌ప్లానింగ్‌ విభాగం అధికారులు ఈ అదనపు అంతస్తు కూల్చివేతకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి తన అనుచరులతో అక్కడకు చేరుకుని వీరంగం సృష్టించారు. ఒక దశలో అక్రమ కట్టడం కూల్చేస్తున్న మున్సిపల్‌ సిబ్బందిపై ద్వారంపూడి అనుచరులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఇటుకలతో దాడిచేయడంతో సిబ్బంది అక్కడినుంచి పరుగులు తీశారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినా, మాజీ ఎమ్మెల్యే జోలికి వెళ్లలేదు. గంటపాటు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆయన వెళ్లిపోయిన తర్వాత కూల్చివేత పనులు ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని