Damodar Raja Narasimha: త్వరలో క్యాబినెట్‌ విస్తరణ.. సీతక్కకు హోంశాఖ దక్కే ఛాన్స్‌: దామోదర రాజనర్సింహ

త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. సోమవారం విలేకర్లతో చిట్‌చాట్‌ సందర్భంగా కీలక అంశాలు వెల్లడించారు.

Updated : 01 Jul 2024 18:32 IST

హైదరాబాద్‌: త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. సోమవారం విలేకర్లతో చిట్‌చాట్‌ సందర్భంగా పలు కీలక అంశాలు వెల్లడించారు. క్యాబినెట్‌ విస్తరణతో పాటు పలువురు మంత్రుల శాఖల్లోనూ మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. కొత్తగా ఐదారుగురికి మంత్రివర్గంలో చోటుదక్కే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మంత్రి సీతక్కకు హోం మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దానం నాగేందర్‌కు క్యాబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందని రాజనర్సింహ వ్యాఖ్యానించారు. నిజామాబాద్‌ నుంచి ఒకరికి క్యాబినెట్‌లో చోటు దక్కొచ్చని తెలిపారు. త్వరలోనే వైద్యశాఖలో ప్రక్షాళన చేపడతామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు