BJP: హామీల అమలుపై కాంగ్రెస్‌ నేతల కాలయాపన: రఘునందన్‌రావు

అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తవుతున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు.

Updated : 03 Jul 2024 19:13 IST

హైదరాబాద్‌: అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తవుతున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ నేతలు కమిషన్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన కాంగ్రెస్ హామీల అమలు ఏమైంది? డిసెంబర్ 9న రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు మ్యానిఫెస్టో మీద కూడా గౌరవం లేదు. తొలుత రుణమాఫీ అన్నారు. తొమ్మిది నెలలు కావొస్తున్నా రుణమాఫీ ఊసే లేదు. అభయహస్తం మ్యానిఫెస్టోలో వరి ధాన్యానికి రూ.2683 రూపాయల మద్దతు ధర ఇస్తామని చెప్పిన హామీ ఏమైంది? డిసెంబర్ 9న రుణమాఫీ ఎందుకు చేయలేదు? ఇందిరమ్మ రైతు భరోసా ఎక్కడ? వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు.. ఏమైంది? 

పంద్రాగస్టు కల్లా రుణమాఫీ చేస్తామని భువనగిరిలో లక్ష్మీ నరసింహస్వామి, మెదక్‌లో ఏడుపాయల దుర్గమ్మ మీద సీఎం రేవంత్ రెడ్డి ఒట్లు వేశారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా కాంగ్రెస్ పాలకులు టైం పాస్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అడుగులు తడబడుతున్నాయి. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యేనాటికి మరో 15 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పరిస్థితి భారాసలో నెలకొంది. మరో 15 నెలల్లో భారాస పార్టీ ఉంటుందా? అనే అనుమానం వస్తోంది. ఐదు రోజులు దిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి రాజకీయాలు తప్ప అభివృద్ధి కోసం ఆలోచించ లేదు’’ అని రఘునందన్‌రావు వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని