Chandrababu: ఒక సీఎంకు 986 మందితో భద్రతా?: చంద్రబాబు ఆశ్చర్యం

రాజకీయ నేరస్థులకు రాష్ట్రంలో ఎక్కువ భద్రత ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Updated : 28 Jun 2024 20:28 IST

అమరావతి: రాజకీయ నేరస్థులకు రాష్ట్రంలో ఎక్కువ భద్రత ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఒక ముఖ్యమంత్రికి 986 మందితో భద్రతా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా గత సీఎం జగన్‌ భద్రత అంశంపై విలేకర్లు అడిగిన ప్రశ్నపై చంద్రబాబు స్పందించారు. 

‘‘ఒక ముఖ్యమంత్రి భద్రతకు 986 మంది సిబ్బంది కావాలా? అదీ పరదాలు కట్టుకొని తిరగడానికి..! మేం వెళ్లినా పరదాలు కట్టేస్తున్నారు.. ఏంటయ్యా ఇది అని అడిగితే అలవాటైపోయింది సర్‌ అంటున్నారు. పరదాలు కట్టడం, చెట్లు కొట్టేయడమేంటి? అవసరమైన మేరకే ట్రాఫిక్‌ ఆపాలని చెబుతున్నా. నాకు రెండు నిమిషాలు లేటైనా ఫర్వాలేదు.. నేను నిలబడతాను. వాళ్లంతా వెళ్లాకే వెళ్తానని చెబుతున్నా. ఎక్కువ టైం ఎక్కడా ఆఫ్ చేయొద్దని మంత్రులకు, కేబినెట్‌ సమావేశంలోనూ చెప్పాను. ఎలాంటి ఆర్భాటాలూ వద్దని చెప్పా. మనమేం రాజులం కాదు.. డిక్టేటర్లం కాదు.. ఇష్టానుసారం చేయడానికి. ప్రజాసేవకులుగా ప్రవర్తించమంటున్నా’’ అని చంద్రబాబు అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు