Chandrababu: నేడు దిల్లీకి చంద్రబాబు.. రేపు ప్రధాని మోదీతో భేటీ

ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం దిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 5.10 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయల్దేరి 7.25 గంటలకు దిల్లీ చేరుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారు.

Updated : 03 Jul 2024 07:26 IST

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం దిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 5.10 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయల్దేరి 7.25 గంటలకు దిల్లీ చేరుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. అనంతరం హోం మంత్రి అమిత్‌ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, నితిన్‌ గడ్కరీ, జేపీ నడ్డా తదితరులను కలిసే అవకాశముంది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు దిల్లీకి వెళ్లటం ఇదే తొలిసారి. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌రెడ్డి ఈ పర్యటనలో పాల్గొననున్నారు. విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు సహకారం, పారిశ్రామిక రాయితీలు, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల మంజూరు వంటి అంశాల్లో సహకారం అందించాలని ప్రధాని, సంబంధిత శాఖల మంత్రులను చంద్రబాబు కోరే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా నివేదికలు ఇవ్వనున్నట్లు సమాచారం. కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఏపీకి మేలు జరిగేలా కేటాయింపులు జరపాలని కోరనున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు