Nadendla manohar: కాకినాడ పోర్టు అడ్డాగా ద్వారంపూడి ఫ్యామిలీ రాజ్యమేలింది: మంత్రి నాదెండ్ల

జగన్‌ సర్కారు హయాంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబం కోసం యావత్‌ ప్రభుత్వ శాఖలన్నీ పనిచేశాయని మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు.

Updated : 28 Jun 2024 14:52 IST

కాకినాడ: జగన్‌ సర్కారు హయాంలో వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబం కోసం ప్రభుత్వ శాఖలన్నీ పనిచేశాయని మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. కాకినాడ కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పౌరసరఫరాల శాఖలో వ్యవస్థాపరమైన లోపాలను అధికారులతో చర్చించారు. గతంలో అధికారుల అలసత్వం కారణంగా చిత్తూరు జిల్లా నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్ ద్వారా వేలాది లారీల రేషన్‌ బియ్యం కాకినాడ పోర్టుకు చేరిందని ఆరోపించారు. కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకుని ద్వారంపూడి కుటుంబం రాజ్యమేలిందన్నారు. అక్రమంగా బియ్యాన్ని ఎగుమతి చేస్తూ ద్వారంపూడి ఓ ప్రత్యేక మాఫియాను నడిపించారని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో అలాంటివి చెల్లవని, అధికారులు పద్ధతులు మార్చుకోవాలని మంత్రి తీవ్రంగా హెచ్చరించారు. సమావేశం అనంతరం అధికారులతో కలిసి పోర్టును పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు