Chandrababu: కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన.. వినతులు ఇచ్చేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు

సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈక్రమంలో ఆర్అండ్‌బీ అతిథి గృహం వద్ద ఆయనకు వినతులు ఇచ్చేందుకు ప్రజలు పెద్దఎత్తున చేరుకున్నారు.

Updated : 26 Jun 2024 11:58 IST

కుప్పం పట్టణం: సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఆర్అండ్‌బీ అతిథి గృహం వద్ద ఆయనకు వినతులు ఇచ్చేందుకు ప్రజలు పెద్దఎత్తున చేరుకున్నారు. దీంతో అతిథి గృహం కిక్కిరిసింది. వినతుల స్వీకరణ అనంతరం మధ్యాహ్నం కుప్పం డిగ్రీ కళాశాలలో అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం పీఈఎస్‌ ఆడిటోరియంలో తెదేపా శ్రేణులతో సమావేశం కానున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని