Chandrababu: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) దిల్లీ పర్యటన కొనసాగుతోంది. నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన భేటీ అయ్యారు.

Updated : 05 Jul 2024 14:09 IST

దిల్లీ: వైకాపా ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక అవసరాలపై మెమోరాండాన్ని ఆమెకు అందజేశారు. ఏపీకి నిధుల కేటాయింపులు ఎందుకు పెంచాలో అందులో వివరించారు. సుమారు గంట పాటు వివిధ అంశాలపై కేంద్రమంత్రితో సీఎం చర్చించారు.

అప్పుల భారంతో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని.. పలు ప్రాజెక్టులకు ఆర్థికసాయం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పోలవరం, అమరావతితో పాటు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించాలని కోరారు. గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని వివరించారు. 2023-24లో రాష్ట్ర అప్పులు జీఎస్‌డీపీలో 33.32 శాతానికి చేరుకున్నాయని తెలిపారు. 2019-20లో అది 31.02 శాతమే ఉందని సీఎం గుర్తుచేశారు. పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలను పరిష్కరించాలని నిర్మలను చంద్రబాబు కోరారు. సీఎం విజ్ఞప్తిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. వీలైనంతవరకు కేంద్రం నుంచి ఆర్థిక భరోసా అందిస్తామని నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఏపీకి చెందిన కేంద్రమంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎన్డీయే ఎంపీలు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని