Srinivasa Varma: ప్రత్యేక హోదా.. తీర్మానాలు చేస్తే ఇచ్చే అంశం కాదు: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ

ఏపీ అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలో ఆలోచించి ముందుకు వెళ్తామని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు.

Updated : 03 Jul 2024 16:14 IST

దిల్లీ: ఏపీ అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలో ఆలోచించి ముందుకు వెళ్తామని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. బుధవారం సాయంత్రం దిల్లీలో రాష్ట్రానికి చెందిన ఎన్డీయే ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారని చెప్పారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ కార్యాలయంలో ‘అమ్మ’ పేరుతో మొక్క నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలో పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్క నాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రమంత్రి స్పందించారు.

‘‘కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే కూటమి ప్రభుత్వం ఉంది. ప్రత్యేక హోదా.. తీర్మానాలు చేస్తే ఇచ్చే అంశం కాదు. అలా అయితే దేశంలోని అన్ని రాష్ట్రాలూ చేస్తాయి. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై నేను చెప్పలేను. దీనిపై ప్రధాని నిర్ణయం తీసుకోవాలి. బిహార్‌కు కూడా ఇదే వర్తిస్తుంది. ‘హోదా’ ఎందుకు ఇవ్వడం లేదో గతంలో స్పష్టంగా చెప్పారు. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రత్యేక హోదా స్థానంలో ప్యాకేజీ ఇచ్చారు. ఆ నిధుల ద్వారా రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. వైకాపా ప్రభుత్వ వైఫల్యం వల్ల పోలవరం సమస్యల్లో ఉంది. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుంది’’ అని శ్రీనివాసవర్మ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు