Palla Rajeshwar Reddy: భారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అరెస్ట్‌

భారాసకు చెందిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అరెస్ట్‌ అయ్యారు.

Updated : 01 Jul 2024 15:13 IST

హైదరాబాద్‌: భారాసకు చెందిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అరెస్ట్‌ అయ్యారు. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్‌నాయక్‌ను పరామర్శించేందుకు పల్లా వెళ్లారు. ఈ క్రమంలో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్‌కు తరలించారు. 

ఇదేనా మీ ప్రజా పాలన?: హరీశ్‌రావు

భారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి సహా పలువురిని అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగుల డిమాండ్లు పరిష్కరించాల్సింది పోయి.. పరామర్శించేందుకు వెళ్తున్నవారిని అడ్డుకోవడం అప్రమాస్వామికమన్నారు. ఇదేనా మీ ప్రజా పాలన? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో హామీలతో ఊదరగొట్టిన నేతలకు నిరుద్యోగుల ఆవేదన ఎందుకు అర్థం కావడం లేదని నిలదీశారు.  అక్రమంగా అరెస్టు చేసిన వారిని తక్షణం విడుదల చేయాలని, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని భారాస పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నట్లు ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు