BJP: శ్రీవారి ఆభరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: భానుప్రకాశ్‌ రెడ్డి

ప్రపంచ హిందూ ధార్మిక క్షేత్రమైన తిరుమలను గత ప్రభుత్వం అధర్మ క్షేత్రంగా మార్చిందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌ రెడ్డి ఆరోపించారు.

Updated : 05 Jul 2024 14:03 IST

తిరుమల: ప్రపంచ హిందూ ధార్మిక క్షేత్రమైన తిరుమలను వైకాపా ప్రభుత్వం అధర్మ క్షేత్రంగా మార్చిందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌ రెడ్డి ఆరోపించారు. దర్శన టికెట్లు, లడ్డూ ప్రసాదాలు, ఇంజినీరింగ్ పనులంటిన్నింటిలోనూ అవినీతి చేశారని విమర్శించారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తితిదేలో శ్రీవారి ఆభరణాలు భద్రమేనా? అనే అనుమానాలు భక్తులకు ఉన్నాయన్నారు. వైకాపా హయాంలో రూ.వందల కోట్లు కమిషన్ల రూపంలో దండుకున్నారని ధ్వజమెత్తారు. శ్రీవారి ఆభరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి విచారణ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గతంలో తితిదే ఛైర్మన్‌గా పనిచేసిన భూమన కరుణాకరరెడ్డిపై తమకు నమ్మకం లేదని భానుప్రకాశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు