Kcr: లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో భారాసకు దిష్టిపోయింది: కేసీఆర్‌

భారాస విజయ ప్రస్థానంలో లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో దిష్టి తీసినట్లైందని మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

Updated : 03 Jul 2024 20:38 IST

గజ్వేల్‌: భారాస విజయ ప్రస్థానంలో లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో దిష్టి తీసినట్లైందని మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. మహబూబాబాద్‌, మేడ్చల్‌, నల్గొండ జిల్లా నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం పబ్బం గడుపుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు ఓటేసి పొరపాటు చేశామనే విషయం ప్రజలకు అర్థమైందన్నారు. భారాసను తిరిగి తెలంగాణ సమాజం కోరుకుంటోందని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు త్వరలోనే వస్తాయన్నారు. కాంగ్రెస్‌ పాలనపై ప్రజలు విరక్తితో ఉన్నారని, ఆ విషయం క్షేత్రస్థాయిలో కనిపిస్తోందన్నారు. పునరుత్తేజంతో మరింతగా ప్రజాదరణ కూడగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తనను కలిసేందుకు ముందస్తు సమాచారంతో మాత్రమే రావాలని సూచించారు. వారానికి రెండు నియోజకవర్గాల పేర్లు  చెబుతానని, చెప్పిన వాళ్లు మాత్రమే వస్తే వారితో మనస్ఫూర్తిగా మాట్లాడతానని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని